న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.58.50 తగ్గింది. దీంతో దేశ రాజధానిలో ఆ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,665గా నమోదైంది. గృహ అవసరాలకు వాడే సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు విమాన ఇంధనం(ఏటీఎఫ్) ధర మూడు నెలల తగ్గింపు తర్వాత ఒక్కసారిగా 7.5 శాతం పెరిగింది.
దీంతో ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.6,271.5 పెరిగి రూ.89,344.05కు చేరుకుంది. గత మూడు నెలల్లో తగ్గించిన మొత్తానికి సమానంగా తాజాగా ఏటీఎఫ్ ధరను పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.