న్యూఢిల్లీ : హోటల్స్, రెస్టారెంట్స్‌లో వినియోగించే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 24, విమానాల్లో ఇంధనంగా వాడే ఏటీఎఫ్‌పై 3 శాతం (రూ.2,414) మేరకు తగ్గిస్తున్నట్టు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. సవరించిన ధరల ప్రకారం, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు ముంబైలో రూ. 1,723, న్యూఢిల్లీలో రూ. 1,647గా ఉన్నాయి.
కాగా, గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. రెండు సంవత్సరాల తర్వాత మొదటిసారి సీఎన్జీ, వంటగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగించే సహజ వాయువు ధరలను కేంద్రం తగ్గించింది.