అయోధ్య: మహార్షి వాల్మీకి ఎయిర్‌పోర్టు(Valmiki Airport) రామాయణ కళతో ఉట్టిపడుతోంది. అద్భుతమైన కళాకండానికి కేంద్రంగా ఆ విమానాశ్రయాన్ని డెవలప్ చేశారు. రామాయణ కథ ఆధారంగా ఉన్న అనేక చిత్రాలను ఎయిర్‌పోర్టు లాబీల్లో డిజైన్ చేశారు. స్థానికంగా వాడే కలర్స్‌తో ఆ కథా చిత్రాలను ఎయిర్‌పోర్టు లాబీల్లో వేశారు. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఆ చిత్రాల్లో రామాయణ కథ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.
అయోధ్య కొత్త ఎయిర్‌పోర్టును విపుల్ వర్షనే డిజైన్ చేశారు. శ్రీరాముడి జీవితం ఆధారంగా ఏరోడ్రోమ్ స్ట్రక్చర్‌ను నిర్మించారు. ఉత్తరభారత దేశంలో కనిపించే నగరా శిల్ప శైలిలో విమానాశ్రయాన్ని కట్టారు. ఏడు శిఖరాలు ఉండే రీతిలో ఎయిర్‌పోర్టును నిర్మించారు. వాల్మీకి రాసిని రామాయణంలోని ఏడు ఖండాలకు నిదర్శనంగా ఎయిర్‌పోర్టును డెవలప్ చేశారు.
#WATCH | Visuals from the Maharishi Valmiki International Airport Ayodhya Dham, in Ayodhya, Uttar Pradesh
Prime Minister Narendra Modi will today inaugurate the newly built Ayodhya Airport. pic.twitter.com/CPiovpCFgM
— ANI (@ANI) December 30, 2023
రెండు అంతస్థుల్లో ఉన్న విమానాశ్రయంలో.. అయోధ్య నగర గత చరిత్రను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్లో ప్యాసింజెర్లను ఇన్వైట్ చేస్తారు. ఇక ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎయిర్‌పోర్టు ఆపరేషన్స్ జరగనున్నాయి. మండపాలు, నగరా శైలి కళాకృతులతో విమానాశ్రయ బిల్డింగ్ ఆకర్షణీయంగా తయారైంది.
1450 కోట్ల ఖర్చుతో విమానాశ్రయాన్ని నిర్మించారు. రామాయణ ఆర్ట్ వర్క్ ప్రతి ఒకరిలో ఆధ్యాత్మికతను నింపుతోంది. టర్మినల్ బిల్డింగ్‌లో వేసిన కాన్వాస్ ఆర్ట్ ఎన్నో సందేశాలను ఇస్తోంది. ప్రతి ఆర్ట్ వర్క్‌లోనూ రామాయణ సౌందర్యం తొణికిసలాడుతుంది. సాంప్రదాయమే కాదు, ఓ భిన్నమైన సమ్మోహానానుభూతి కలుగుతుంది.
ప్రతి ఏడాది 10 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకోనున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, అహ్మాదాబాద్ నగరాల నుంచి విమానాలను నడపనున్నారు. రెగ్యులర్ ఫ్లయిట్ ఆపరేషన్స్ జనవరి ఆరో తేదీ నుంచి మొదలవుతాయి. ఇవాళ ప్రధాని మోదీ ఈ విమానాశ్రయాన్ని ఓపెన్ చేయనున్నారు. జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయాన్ని ఓపెన్ చేస్తున్నారు.