న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం గురువారం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఈ సిఫారసు చేసింది.
ఈ సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆరేళ్లకుపైగా పని చేస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టే అవకాశం కూడా ఉంటుంది.