వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ కాలేజీ విద్యార్థి(Student Murder)ని మర్డర్‌కు గురైంది. ఆమె భాయ్‌ఫ్రెండ్ ఆ హత్య చేశాడు. పదేపదే డబ్బలు ఇవ్వాలని వత్తిడి చేయడం వల్లే ఆమెను చంపినట్లు నిందితుడు తెలిపాడు. బాధిత అమ్మాయిని అల్కా బింద్‌గా గుర్తించారు. ఆమె గొంతు కోసి ఉంది. ఆమె శరీరాన్ని ఓ బ్లాంకెట్‌లో చుట్టు ఓ రూమ్‌లో వేశాడు. మిర్జామురాద్ ఏరియాలోని రూపాపుర్లో ఉన్న విధాన్ బసేరా దాబాలో ఆమె బాడీని గుర్తించారు. 22 ఏళ్ల అల్కా బింద్ ఎంస్సీ చదువుతున్నది. బుధవారం కాలేజీకి వెళ్లిన ఆమె మిస్సింగ్ అయినట్లు పోలీసులకు సమాచారం రావడంతో కేసు బయటపడింది. నిందితుడు సాహబ్ బింద్‌ను తన సోదరి ఇంట్లో ఉండగా అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి పిస్తోల్ స్వాధీనం చేసుకున్నారు. మీర్జాపూర్‌కు చెందిన అతని కాలులో షూట్ చేశారు. ప్రస్తుతం సాహబ్‌కు చికిత్స అందిస్తున్నట్లు వారణాసి డిసీపీ ఆకాశ్ పటేల్ తెలిపారు.
పోలీసులు కథనం ప్రకారం.. అల్కా బింద్.. ఉదయం 9.30 నిమిషాలకు ఇంటి నుంచి కాలేజీకి వెళ్లింది. కానీ ఆమె సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. ఆ రోజు రాత్రి దాబాలోని ఓ రూమ్‌లో ఆమె శరీరాన్ని గుర్తించారు. ఆమె కాల్ రికార్డింగ్‌లు, సీసీటీవీ కెమెరా ఆధారంగా బాయ్‌ఫ్రెండ్ సాహబ్ బింద్‌ను పట్టుకున్నారు. పెళ్లి చేసుకోవాలని, డబ్బులు కావాలని అల్కా పదేపదే వత్తిడి చేసిందని, దాంతో విసిగిపోయి హత్య చేసినట్లు సాహెబ్ పోలీసు విచారణలో తెలిపాడు. దాబా వద్దకు రమ్మని ఫోన్ చేసిన అతను .. అల్కా రాగానే గొంతు కోసి చంపి, ఆమె మొబైల్ ఫోన్, అడ్మిట్ కార్డుతో పరారీ అయ్యాడు.
దాబా ఉద్యోగి క్లీనింగ్ కోసం రూమ్‌లోకి వెళ్లడంతో అల్కా మృతదేహం కనిపించింది. పోస్టు మార్టమ్ కోసం ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబం గురువారం ధర్నా చేసింది.