న్యూఢిల్లీ, మే 12: కాఫీ చైన్ కంపెనీ ‘స్టార్‌బక్స్’ ఓ యాడ్‌కు సంబంధించి వివాదంలో చిక్కుకొన్నది. ట్విట్టర్లో శుక్రవారం #BoycottStarbucks హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. యాడ్‌లో ఇద్దరు దంపతులు తమ కుమారుడు అర్పిత్ కోసం కాఫీ షాపులో ఎదురుచూస్తున్నారు.
అయితే వారి కుమారుడు లింగ మార్పిడితో అర్పితగా మహిళ రూపంలో వచ్చారు. ముందు ఈ మార్పును అంగీకరించని ఆ తండ్రి, తర్వాత స్వీకరించడం అందులో ఉన్నది. ఈ వీడియో వివక్షాపూరితంగా ఉన్నదని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.