ముంబై: బొగ్గు రవాణా చేస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. (Goods Train Derails) ట్రైన్ ఇంజిన్, కొన్ని వ్యాగన్లు పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోయాయి. ఈ సంఘటన నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా గుగస్ నుంచి గుజరాత్‌లోని గాంధీనగర్‌కు బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా అమల్నేర్ వద్ద గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఒక ఇంజిన్, ఏడు వ్యాగన్లు పట్టాలు తప్పి ఒక పక్కకు ఒరిగిపోయాయి.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు అక్కడకు చేరుకున్నారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలును పరిశీలించారు. ఈ సంఘటన వల్ల నందూర్బార్-సూరత్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, గూడ్స్ రైలు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని చెప్పారు. పట్టాలు సరిచేసి రైళ్ల రాకపోకలను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
ALERT! Seven wagons of goods train carrying coal derailed at Amalner on Nandurbar-Surat section. Both lines stalled. No injuries. Traffic affected. pic.twitter.com/V8cPev8GDB
— Rajendra B. Aklekar (@rajtoday) May 15, 2025