న్యూఢిల్లీ: సీఎన్జీ యూజర్లకు షాక్! దేశవ్యాప్తంగా ఢిల్లీ మినహా మిగిలిన నగరాల్లో సీఎన్జీ ధర పెరిగింది. కిలో సీఎన్జీకి రూ.2 చొప్పున పెంచారు. ఢిల్లీ శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ నగరానికి ఈ పెంపుదల నుంచి మినహాయించినట్లు కనిపిస్తున్నది.
ఇన్పుట్ కాస్ట్ 20 శాతం పెరిగినప్పటికీ ఎంజీఎల్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ వంటి సిటీ గ్యాస్ రిటెయిలర్స్ గత రెండు నెలలపాటు సీఎన్జీ ధరలను పెంచలేదు. మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ నెల 22 నుంచి ఎంజీఎల్ రూ.2 పెంచింది. దీంతో కేజీ సీఎన్జీ ధర రూ.77కు చేరింది. సీఎన్జీ ధరలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. దీనికి కారణం వ్యాట్ వంటి స్థానిక పన్నులు వేర్వేరుగా ఉండటమే.