ఐటీ సీటీని ముంచెత్తిన వర్షాలు : టెక్ కంపెనీలతో సీఎం సంప్రదింపులు
భారీ వర్షాలు ముంచెత్తడంతో బెంగళూర్‌లో రహదారులు జలమయమయ్యాయి.
బెంగళూర్ : భారీ వర్షాలు ముంచెత్తడంతో బెంగళూర్‌లో రహదారులు జలమయమయ్యాయి. పోటెత్తిన వర్షంతో ఐటీ కంపెనీలకు కలిగిన నష్టం, పరిహారం వంటి అంశాలపై చర్చించేందుకు టెక్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతానని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.
ఐటీ కంపెనీలతో సమావేశమై భారీ వర్షాలతో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామని, పరిహారంతో పాటు వర్షాల కారణంగా జరిగిన ఇతర నష్టాలపై మాట్లాడతామని సీఎం వెల్లడించారు. సాధారణ రోజుల్లో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండే బెంగళూర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్ ఇబ్బందులు మరింత జటిలమయ్యాయి.
నగర శివార్లలోని టెక్ పార్క్‌ను కలిపే అవుటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. బెల్లందూర్ ప్రాంతంలో రహదారులు నీటమునిగాయి. ఇక కర్నాటకలోని కొడగు జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. దావణగెరె, శివమొగ్గ, చిత్రదుర్గ, మైసూర్ జిల్లాలకు యల్లో అలర్ట్ జారీ చేశారు. గతవారం బెంగళూర్‌లోని మహదేవపుర ప్రాంతం భారీ వర్షాలతో నీట మునిగింది. ఇక వరద పోటెత్తిన ప్రాంతాల్లో ప్రజలకు సాయం అందించేందుకు అగ్నిమాపక, సహాయ, పునరావాస అధికారులు రంగంలోకి దిగారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bengaluru
- Bommai
- CM
- IT companies
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

