న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: భవిష్యత్తులో తుఫాన్లను ముందస్తుగా గుర్తించడంలో ఇబ్బందులు తప్పవని, వాటి గమనాన్ని అంచనా వేయలేకపోవచ్చని తాజాగా పరిశోధకులు వెల్లడించారు. వాతావరణ మార్పుల కారణంగా భూ ఉష్ణోగ్రత, సముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు.
తుఫాన్లు వేగంగా బలం పుంజుకోవడం, బలహీనపడ్డ తర్వాత కూడా తిరిగి విస్తరిస్తుండటంతో శాస్త్రవేత్తలు వాటిని అంచనా వేయడంలో సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉందని హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్సీవోఐఎస్), ఆంధ్ర యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. నష్ట నివారణ చర్యలు, ప్రణాళికలు రచించేందుకు కూడా ఇబ్బందులు తప్పవని తెలిపారు. 1981 -2020 వరకు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన తుఫాన్లపై అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు.