ఆయన ఓ స్లో రన్నర్.. పదో తరగతి వరకు ఆయనది చివరి బెంచ్.. టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్‌లో ఆయన మార్కులు చూస్తే ఆశ్చర్యం కలగక తప్పదు. బోర్డర్ మార్కులతో గెట్టెక్కాడు. ఇంగ్లీష్‌లో 35, గణితంలో 36 మార్కులు మాత్రమే సాధించాడు. అలా పదిలో మొత్తానికి పాసయ్యాడు. కానీ చివరకు ఎవరూ ఊహించని విధంగా ఐఏఎస్ ఆఫీసర్‌గా కొలువు సాధించి.. ప్రశంసలు అందుకున్నాడు.
ఆయనలాంటి బ్యాక్ బెంచ్ విద్యార్థులు.. బోర్డర్ మార్కులతో పాసయ్యే వారికి ఆయన స్టోరీ ప్రేరణగా నిలవాలనే ఉద్దేశంతో.. ఆ ఐఏఎస్ ఆఫీసర్ టెన్త్ మెమోను మరో బ్యూరోక్రాట్ ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు(2009 బ్యాచ్) చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఆవనీష్ శరణ్.. గుజరాత్‌లోని బహ్రూచ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తుషార్ సుమేరా టెన్త్ మెమోను ట్విట్టర్లో షేర్ చేశారు. టెన్త్‌లో సుమేరా కేవలం ఇంగ్లీష్‌లో 35, మ్యాథ్స్‌లో 36 సాధించారని.. దానికి సంబంధించిన మెమోతో పాటు ఆ ఆఫీసర్ ఫోటోను షేర్ చేశారు. అయితే ఆ తర్వాత సుమేరా కష్టపడి జీవితంలో ఎదిగారు. 2012లో ఐఏఎస్ సాధించారు. ఐఏఎస్ ఉద్యోగం సాధించే కంటే ముందు టీచర్‌గా పని చేశారు. డిగ్రీలో ఆర్ట్స్ గ్రూపు చదివారు.
అయితే సుమేరా టెన్త్ మెమోను ట్విట్టర్లో షేర్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే.. ఇప్పుడు పదో తరగతి విద్యార్థులు తమ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. తక్కువగా మార్కులొచ్చాయని బాధపడే విద్యార్థులకు.. ఐఏఎస్ సుమేరా స్టోరీ ప్రేరణగా నిలుస్తోందని ఆవనీష్ శరణ్ చెప్పుకొచ్చారు.
भरूच के कलेक्टर तुषार सुमेरा ने अपनी दसवीं की मार्कशीट शेयर करते हुए लिखा है कि उन्हें दसवीं में सिर्फ पासिंग मार्क्स आए थे.
उनके 100 में अंग्रेजी में 35, गणित में 36 और विज्ञान में 38 नंबर आए थे. ना सिर्फ पूरे गांव में बल्कि उस स्कूल में यह कहा गया कि यह कुछ नहीं कर सकते. pic.twitter.com/uzjKtcU02I
— Awanish Sharan (@AwanishSharan) June 11, 2022