ఇంఫాల్, నవంబర్ 25: మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకున్నది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో గ్రామ సహాయకుడు మరణించాడు. ఈ ఘటన శనివారం కాంగ్పోకి జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకున్నది. తుపాకులతో గ్రామంలోకి ప్రవేశించిన కొందరు తొలుత ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడున్న వాళ్లు నిలదీయడంతో గొడవ పెరిగి కాల్పులకు దారి తీసింది.