గురుదాస్‌పుర్: గురుదాస్‌పుర్ కేంద్ర కారాగారంలో(Gurdaspur central jail) రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఖైదీలు కొట్టుకున్నారు. ఆ హింసలో అనేక మంది ఖైదీలు గాయపడ్డారు. పోలీసుల సమాచారం మేరకు.. రెండు వర్గాల ఖైదీల మధ్య ఘర్షణ జరిగిందని, అయితే ఆపేందుకు వెళ్లిన పోలీసులపై కూడా దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ ఘటనలో స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌తో పాటు ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు. ఆ ఇద్దర్నీ సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు.