బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గ కేంద్ర కారాగారంలో కొందరు ఖైదీలు కావాలనుకుంటే లిక్కర్, సిగరెట్స్, డ్రగ్స్ వాళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నాయి! శనివారం ఓ వ్యక్తి జైలు క్యాంటీన్ కోసమని గేటు బయట ఐదు అరటి గెలలు దించి వెళ్లాడు.
అయితే ఆ అరటి గెలల కాడలు తెరచినట్టుగా ఉండటంతో భద్రతా సిబ్బంది క్షుణ్నంగా తనిఖీ చేశారు. దాంతో గమ్ టేప్‌తో చుట్టిన సిగరెట్లు, మారిజువానా అనే మత్తు పదార్థం బయటపడ్డాయి.