తిరువనంతపురం: ప్రసిద్ధ శబరిమల ఆలయాన్ని సందర్శించాలనుకున్న ఓ చర్చి ఫాదర్ (Christian pries).. సేవకుడిగా తనకున్న లైసెన్సును (Church licence) వదులుకున్న ఘటన కేరళలోని (Kerala) తిరువనంతపురంలో చోటుచేసుకున్నది. రెవరెండ్ మనోజ్ కేజీ (Rev Manoj KG) అనే వ్యక్తి ఆంగ్లికన్ చర్చి ఆఫ్ ఇండియాలో (Anglican Church of India) ఫాదర్‌గా ఉన్నారు. ఆయన ప్రసిద్ధ శబరిమల క్షేత్రాన్ని (Sabarimala Temple) సందర్శించాలనుకున్నారు. ఇందులో భాగంగా ఇతర భక్తుల్లానే ఆయన కూడా మండల దీక్ష కొనసాగిస్తున్నాన్నారు. ఈ నెల 20న అయ్యప్పను దర్శించుకోనున్నారు. అయితే దీనిపై దుమారం రేగడంతో చర్చి సేవల నుంచి తప్పుకున్నారు.
మతాల కంటే దేవుడు అనే భావనకే తాను ప్రాధాన్యం ఇస్తానని మనోజ్ చెప్పారు. తన దీక్ష గురించి తెలిసి చర్చి వర్గాలు వివరణ కోరాయని, దీంతో వారిచ్చిన ఐడీ కార్డు, లైసెన్సు తిరిగి ఇచ్చేశానని వెల్లడించారు. మతాచారాలకు అతీతమైన హిందూయిజంపై అవగాహన పెంచుకోవడమే తన ఉద్దేశమని తెలిపారు. చర్చిలో చేరింది కూడా ఈ ఆలోచనతోనేనని స్పష్టం చేశారు. ఈ నెల 20న శబరిమల క్షేత్రానికి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నాని పేర్కొన్నారు. చర్చి బాధ్యతలు తీసుకోకముందు మనోజ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు.