Doklam | న్యూఢిల్లీ, డిసెంబర్ 18 : గత కొన్ని దశాబ్దాలుగా భారత్, చైనా, భూటాన్ ట్రై జంక్షన్లో కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గత ఎనిమిదేండ్లుగా భూటాన్‌కు చెందిన ఈ భూభాగంలో చైనా 22 గ్రామాలు, స్థావరాలను నిర్మించినట్టు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. అందులో 8 గ్రామాలు భూటాన్‌లో ఉన్న డోక్లాం పీఠభూమిలో ఉన్నాయి.
ఇది చైనా మిలటరీ బేస్‌లకు సమీపంలో ఉండటమే కాక, వ్యూహాత్మక ప్రదేశం. దీని కారణంగా భారత్‌లోని సిలిగురి కారిడార్ (చికెన్ నెక్)కు ప్రమాదం పొంచి ఉంది. భారత్‌లోని ఏడు ఈశాన్య రాష్ర్టాలను కలుపుతున్నది. ఇది స్వాధీనం చేసుకుంటే ఆ రాష్ర్టాలతో భారత్‌కు సంబంధాలను తెంపేయవచ్చు.