Watch: షాపింగ్ మాల్లో తండ్రి చేతుల్లో నుంచి జారిపడి.. పసి బాలుడు మృతి
Child Slips From Father's Arms | షాపింగ్ మాల్లో తండ్రి చేతుల్లో నుంచి పసి బాలుడు జారిపోయాడు. చాలా ఎత్తు నుంచి కిందపడటంతో మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రాయ్‌పూర్: షాపింగ్ మాల్లో తండ్రి చేతుల్లో నుంచి పసి బాలుడు జారిపోయాడు. (Child Slips From Father’s Arms) చాలా ఎత్తు నుంచి కిందపడటంతో మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి షాపింగ్ కోసం రాయ్‌పూర్‌లోని సిటీ సెంటర్ మాల్‌కు వెళ్లారు. ఒక వ్యక్తి చేతిలో ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. ఐదేళ్ల వయసున్న మరో కుమారుడు కూడా అతడి వెంట ఉన్నాడు.
కాగా, షాపింగ్ మాల్ మూడో అంతస్తులో ఎస్కలేటర్ వద్ద వారు ఉండగా దానిని ఎక్కేందుకు ఐదేళ్ల కుమారుడు ప్రయత్నించాడు. అయితే అతడ్ని వారించే ప్రయత్నంలో ఏడాదిన్నర వయసున్న పసి బాలుడు ఆ వ్యక్తి చేతి నుంచి జారిపోయాడు. షాపింగ్ మాల్లో చాలా ఎత్తు నుంచి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ పసి బాలుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు ఆ షాపింగ్ మాల్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Toddler at Raipur mall dies after falling from the third floor after he accidentally slips from the lap of the guardian, while he looked after another child.#Raipur pic.twitter.com/aGlW7oZUAk
— Anurag Tyagi (@TheAnuragTyagi) March 20, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

