Navy Chief : ఇండోనేషియా (Indonesia) పర్యటనలో ఉన్న భారత నేవీ చీఫ్ (Indian Navy Chief), అడ్మిరల్ (Admiral) దినేశ్ కే త్రిపాఠి (Dinesh K Tripathi).. ఆ దేశ రక్షణ మంత్రి, లెఫ్టినెంట్ జనరల్ జాఫ్రీ జంషుద్దీన్ (Sjafrie Sjamsoeddin) తో భేటీ అయ్యారు. భారత్-ఇండోనేషియా (India – Indonasia) రక్షణ సంబంధాల (Defence ties) కు ఈ భేటీని కీలక ముందడుగుగా చెప్పవచ్చు.
భారత్-ఇండోనేషియా మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో చర్చించారు. రక్షణ పరిశ్రమలో రెండు దేశాల నడుమ పరస్పర సహకారాన్ని విస్తరించడంపై కూడా ఈ సమావేశంలో చర్చి జరిగింది. భారత నేవీ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
Chief of Naval Staff, Admiral Dinesh K Tripathi during his ongoing visit to Indonesia called on Lt Gen Sjafrie Sjamsoeddin (retd), Minister of Defence, Republic of Indonesia, marking a significant step in deepening defence ties. Discussions were held on the growing… pic.twitter.com/DxenTPa4XE
— ANI (@ANI) December 17, 2024