Crime news : ఛత్తీస్‌గఢ్ (Chhattishgarh) సాయుధ బలగాల (Armed Force) కు చెందిన ఓ కానిస్టేబుల్ (Constable) తన సర్వీస్ రివాల్వర్‌తో ఇద్దరు బంధువులను కాల్చిచంపాడు. కోర్బా జిల్లా (Korba district) లోని హర్దిబజార్ (Hardibazar) పోలీస్ స్టేషన్ పరిధిలోగల చింద్పూర్ (Chhindpur) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శేష్‌రామ్ బింజ్వార్ అనే వ్యక్తి సీఏఎఫ్ 13 బెటాలియన్‌లో మద్వరని ఏరియాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ కోర్బా జిల్లా పర్యటన నేపథ్యంలో.. శేష్‌రామ్ బింజ్వార్కు బందోబస్తు డ్యూటీ వేశారు. అయితే శేష్‌రామ్‌కు తన చిన్నమామ (భార్య పినతండ్రి) తో కుటుంబ తగాదా ఉండటంతో బందోబస్తుకు వెళ్లకుండా చిన్నమామ ఇంటికి వెళ్లాడు.
అక్కడ తన సర్వీస్ రివాల్వర్‌తో చిన్నమామ రాజేష్ బింజ్వార్పై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దాంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన అతడి 17 ఏళ్ల కుమార్తె మందస బింజ్వార్ను కూడా షూట్ చేశాడు. ఆమె కూడా స్పాట్లోనే కుప్పకూలింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.