Watch: నోట్ల కట్టలతో కనిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Congress MLA With Huge Cash | కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే భారీ నోట్ల కట్టలతో కనిపించారు. బెడ్‌పై డబ్బుల కట్టలు ఉండగా వాటి ఎదురుగా ఆయన కూర్చొని ఉన్నారు. (Congress MLA With Huge Cash) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రాయ్‌పూర్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే భారీ నోట్ల కట్టలతో కనిపించారు. బెడ్‌పై డబ్బుల కట్టలు ఉండగా వాటి ఎదురుగా ఆయన కూర్చొని ఉన్నారు. (Congress MLA With Huge Cash) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. చంద్రపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్‌కుమార్ యాదవ్, నోట్ల కట్టలున్న బెడ్ పక్కగా సోఫాపై కూర్చున్నారు. పక్కన ఉన్న మరో వ్యక్తితో ఆయన మాట్లాడుతున్నారు. అయితే డబ్బుల కట్టలున్న బెడ్‌పై కూర్చొన్న మరో వ్యక్తి ముఖం కనిపించలేదు.
కాగా, ఛత్తీస్‌గఢ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఓపీ చౌదరి ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో ఆదివారం పోస్ట్ చేశారు.‘ఎమ్మెల్యే ముందు నోట్ల కట్టలున్న ఈ వీడియోను కాంగ్రెస్ అంగీకరిస్తుందా?’ అని ప్రశ్నించారు. ఈ వీడియోపై ఏదైనా సందేహం ఉంటే, దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతుందా? అని సవాల్ విసిరారు. ఐదేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌ను అవినీతి కాంగ్రెస్ లూఠీ చేస్తున్నదని ఆరోపించారు.
మరోవైపు వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్‌కుమార్ యాదవ్ స్పందించారు. పేద కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా అయిన తన ప్రతిష్టను కించపరిచే కుట్ర అని ఆరోపించారు. తాను ఆ డబ్బు వైపు చూడలేదని, అక్కడ వారు చెబుతున్నదని వింటున్నానని తెలిపారు. తాను డబ్బులతో లేదా విమానం, బంగ్లాతో కనిపిస్తే అవి తనకు చెందుతాయా? అన్ని ప్రశ్నించారు.
कांग्रेस विधायक जी के सामने रखे नोटों की गड्डी वाले इस वीडियो को स्वीकार करेगी या वीडियो पर कोई संदेह है तो जाँच के लिये CBI को सौंपने का साहस दिखायेगी??
या फिर कोयला वाले वीडियो की तरह मेरे ऊपर FIR दर्ज करायेगी??
ये हैं कांग्रेस के छत्तीसगढ़ में चंद्रपुर के विधायक रामकुमार… pic.twitter.com/HGKSrHXTEm
— OP Choudhary (@OPChoudhary_Ind) September 17, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

