చెన్నై: చెన్నై సమీపంలోని కవరైపట్టై వద్ద శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న గూడ్స్‌ను మైసూర్ – దర్భంగ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ప్రెస్ బోగీలు రెండు దగ్ధమయ్యాయి. మరో రెండు పట్టాలు తప్పాయి. వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ప్రాక్టీస్‌లో ఫిరంగి పేలి ఇద్దరు అగ్నివీర్ల మృతి ; తెలుగు యువకుడికి తీవ్ర గాయాలు
ముంబై, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): నాసిక్‌లో భారత ఆర్మీ ఆర్టిలరీ సెంటర్లో జరిగిన ప్రమాదంలో హైదరాబాద్ ఆర్టిలరీకి చెందిన ఇద్దరు అగ్నివీర్లు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయడపడ్డారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన గోహిల్ విశ్వరాజ్ సింగ్ (20), పశ్చిమబెంగాల్‌కు చెందిన సైకత్, తెలుగువాడైన అప్పలస్వామి (20) హైదరాబాద్ ఆర్టిలరీకి అగ్నివీర్లుగా నియామకమయ్యారు. గురువారం ఫిరంగితో కాల్పులు ప్రాక్టీస్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన గోహిల్ సింగ్, గున్నెర్ సైకత్ షిత్ దేవలాలిలోని మిలటరీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అప్పలస్వామి తీవ్రంగా గాయపడ్డారు.