Chennai Airport | చెన్నై ఎయిర్పోర్టులో 22 పాములు, ఒక ఊసరవెల్లి సీజ్
Chennai Airport | చెన్నై : చెన్నై ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగులో నుంచి 22 పాములు, ఒక ఊసరవెల్లిని అధికారులు సీజ్ చేశారు.
Chennai Airport | చెన్నై : చెన్నై ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగులో నుంచి 22 పాములు, ఒక ఊసరవెల్లిని అధికారులు సీజ్ చేశారు. ఈ మహిళా ప్రయాణికురాలు కౌలలంపూర్ నుంచి చెన్నైకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వివిధ రకాల జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లి ఆమె బ్యాగులో లభించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమెపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి చెన్నై పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. పారదర్శకంగా ఉండే ప్లాస్టిక్ కంటైనర్లలో పాములను ఉంచి తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు.
Indian Customs : Guardians of wildlife!@ChennaiCustoms intercepted a female pax arriving from Kuala Lumpur by Flight No.AK13. On examination of check-in baggage, 22 Snakes of various species & a Chameleon were found; seized under CA, 1962 r/w Wildlife Protection Act, 1972. pic.twitter.com/5Xfu8OK217
— CBIC (@cbic_india) April 30, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

