న్యూఢిల్లీ: ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)కి ఆదరణ లభిస్తున్నది. కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలోని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓఎన్డీసీని గతేడాది ప్రారంభించింది. ప్రస్తుతం 10 వేలకు పైగా రోజువారీ ఆర్డర్లను పొందుతున్నది. ఇందులో తక్కువ ధరకు కావాల్సినవి కొనొచ్చని నెటిజన్లు సోషల్ మీడియాలో వారి ఆర్డర్ స్క్రీన్షాట్లను పోస్ట్ చేస్తున్నారు.
ఫుడ్ డెలివరీ రంగంలో ఓఎన్డీసీ ద్వారా చాలా తక్కువ ధరకు ఆహారాన్ని పొందవచ్చని నెటిజన్లు చెప్తున్నారు. ఓఎన్డీసీకి ఎలాంటి యాప్ ఉండదు. పేటీఎం, మీషో, మ్యాజిక్‌పిన్, మైస్టోర్ వంటి బయ్యర్ యాప్‌లలో ఓఎన్డీసీని వినియోగించుకోవచ్చు.