న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: నేటి ప్రపంచంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నది. కృత్రిమ మేధ దూసుకుపోతున్నది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్ ‘చాట్‌జీపీటీ’ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నది. ఈ చాట్‌బాట్‌ను ఏ ప్రశ్న అడిగినా క్షణాల్లో సమాధానం ఇస్తున్నది. తాజాగా భారత ప్రధాని మోదీ గురించి చాట్‌జీపీటీ ఏం సమాధానం ఇచ్చిందో తెలుసా..! ఆయనో వివాదాస్పద వ్యక్తి(కాంట్రవర్షియల్ ఫిగర్) అని చెప్పిందట. అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీ మెంబర్, వ్యాపారవేత్త ఇస్సాక్ లాటెరెల్ అడిగిన ప్రశ్నకు ఆ సాఫ్ట్వేర్ టూల్ ఈ మేరకు రిైప్లె ఇచ్చింది.
ఇంకా మోదీతో పాటు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్, తదితర వ్యక్తుల పేర్లను టేబుల్ రూపంలో అందించడంతో పాటు వీరిని ప్రత్యేకంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నది. ఈ జాబితాను లాటెరెల్ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, జర్మనీ మాజీ చాన్స్‌లర్ మెర్కెల్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, తదితర వ్యక్తులను వివాదాలు లేని(నాన్-కాంట్రోవర్షియల్) వారిగా చాట్‌జీపీటీ పేర్కొన్నది.