కోల్కతా: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనుమడు, బెంగాల్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు చంద్ర కుమార్ బోస్ బుధవారం బీజేపీకి రాజీనామా చేశారు. నేతాజీ ఆశయసిద్ధికి కృషి చేస్తామన్న కమలం పార్టీ తన వాగ్దానం నిలుపుకోవడంలో విఫలమైనందున తాను పార్టీని వీడుతున్నట్టు వివరించారు. 2016లో బీజేపీలో చేరిన చంద్రబోస్ ఆ పార్టీ తరఫున 2016లో అసెంబ్లీ, 2019లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీ వేదికగా నేతాజీ సోదరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని భావించానని, అయితే పార్టీ నుంచి సహకారం లభించలేదని ఆయన పేర్కొన్నారు. అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు.