న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు నగదు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది డిసెంబర్లో కిసాన్ నిధి కింద సుమారు 22వేల కోట్లు రిలీజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. డిసెంబర్-మార్చ్ ఇన్‌స్టాల్‌మెంట్‌ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కిసాన్ సమ్మాన్ స్కీమ్ కోసం సుమారు 1.57 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది. డిసెంబర్ 15 నుంచి 25 మధ్య పదవ ఇన్‌స్టాల్‌మెంట్‌ను రిలీజ్ చేయనున్నారు. కిసాన్నిధి స్కీమ్ కింద పశ్చిమ బెంగాల్‌లోని 15 లక్షల మంది రైతుల్ని కలపనున్నారు. దీంతో ఈ స్కీమ్ కింద లబ్ధి పొందుతున్నవారి మొత్తంసంఖ్య 50 లక్షలు కానున్నది. పీఎం కిసాన్ నిది స్కీమ్‌ను ఇప్పట్లో మార్చడం లేదని కేంద్రం స్పష్టం చేసింది.