Special Status | బీహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదు.. తేల్చి చెప్పిన కేంద్రం
Special Status | నితీశ్ కుమార్ పాలిత రాష్ట్రం బీహార్ (Bihar)కు ప్రత్యేక హోదా (Special Status) అంశంపై కేంద్రం స్పష్టతనిచ్చింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్ వేదికగా వెల్లడించింది.
Special Status | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజే ఎన్డీయే కూటమి (BJP-led NDA government)లో ముఖ్య పాత్ర పోషిస్తున్న జేడీయూకి (Janata Dal (United)) గట్టి షాక్ తగిలింది. నితీశ్ కుమార్ పాలిత రాష్ట్రం బీహార్ (Bihar)కు ప్రత్యేక హోదా (Special Status) అంశంపై కేంద్రం స్పష్టతనిచ్చింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో జేడీయూ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు జేడీయూ కూడా కీలకంగా మారిన విషయం తెలిసిందే. 12 మంది ఎంపీలతో కూటమిలో మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. దీంతో జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ డీల్‌తోనే ఎన్డీయే కూటమిలో జేడీయూ భాగమైందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. ప్రత్యేక హోదా లేని పక్షంలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలోనే ఆర్థికవృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బీహార్‌తో పాటు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా..? అని జేడీయూ ఎంపీ రామ్ ప్రిత్ మండల్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ఇవాళ లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నించారు. దీనికి మంత్రి పంకజ్ స్పందిస్తూ.. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని రాతపూర్వకంగా వెల్లడించారు.
ప్రత్యేక హోదా ఇవ్వడానికి జాతీయ అభివృద్ది మండలి-ఎన్డీసీ ఐదు నిబంధనలు పెట్టిందని.. ఆ నిబంధనల ప్రకారం బీహార్‌కు స్పెషల్ స్టేటస్ సాధ్యం కాదని తన సమాధానంలో తేల్చి చెప్పారు. ఎన్డీసీ నిబంధనల ప్రకారం గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. బీహార్‌కు కూడా ప్రత్యేక హోదా అంశంపై అంతర్ మంత్రిత్వ శాఖల బృందం గతంలో అధ్యయనం చేసినట్లు తెలిపారు. 2012 మార్చి 30న నివేదిక కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్డీసీ నిబంధనల ప్రకారం.. బీహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఆ నివేదిక తేల్చి చెప్పిందని లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ లిఖితపూర్వక సమాధానంలో రాష్ట్రాలు ప్రత్యేక హోదా సాధించాలంటే కావాల్సిన అర్హతల గురించి కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది.
The Special Category Status for plan assistance was granted in the past by the National Development Council (NDC) to some States that were characterized by a number of features necessitating special consideration.
The decision was taken based on an integrated consideration of… pic.twitter.com/PbPDiJjLyz
— ANI (@ANI) July 22, 2024
Also Read..
Harish Rao | ఆ నిబంధనల వల్లే రుణమాఫీ కావట్లేదు.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఆగ్రహం
August 15 Movies | ఆగస్టు 15న సినిమాల జాతర..! ఏమేం రిలీజు అవుతున్నాయంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

