శనివారం 16 జనవరి 2021
National - Dec 30, 2020 , 17:19:10

వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రం ససేమిరా?

వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రం ససేమిరా?

న్యూఢిల్లీ: రైతు సంఘాల నేతలతో బుధవారం జరిగిన చర్చల్లో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు నిరాకరించిందని సమాచారం. ఇప్పటికైనా అన్నదాతల ఆందోళనను విరమించాలని కేంద్రం అభ్యర్థించినట్లు సమాచారం. మూడు వారాల పాటు కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్ఠంభన కొనసాగిన తర్వాత బుధవారం విజ్ఞాన్‌భవన్‌లో ఆరో విడుత చర్చలు జరిగాయి.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన విధి విధానాలు, పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) హామీ తదితర అంశాలపైనే చర్చల్లో దృష్టి సారించాలని రైతు సంఘాల నేతలు స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది.ఆందోళన సందర్భంగా మరణించిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, వారికి నష్ట పరిహారం చెల్లించాలని రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. 

చర్చల సమయంలో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, నరేంద్ర సింగ్‌ తోమర్‌లతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఇంతకుముందు చర్చలు జరిగినప్పుడు మంత్రులతో కలిసి భోజనం చేయడానికి రైతు సంఘాల నేతలు అంగీకరించలేదు. అయితే, రైతు నేతలతో భేటీ కావడానికి ముందు కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌లు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. రైతుల ఆందోళనపై చర్చించడానికి సోమవారం 40 రైతు సంఘాల నేతలకు కేంద్రం ఆహ్వానం పంపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.