న్యూఢిల్లీ : అవయవాలను అత్యంత వేగంగా రవాణా చేసి అవసరమైన వారికి అమర్చి(ట్రాన్స్‌ప్లాంటేషన్) వారి ప్రాణాలను కాపాడేందుకు అవలంబించాల్సిన ప్రామాణిక పద్ధతి(ఎస్ఓపీ)ని కేంద్రం శనివారం విడుదల చేసింది. నీతి ఆయోగ్, నేషనల్ ఆర్గాన్ ఆండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ వంటి సంస్థల భాగస్వామ్యంతో వైద్య శాఖ దీనిని రూపొందించింది. వాయుమార్గం, అంబులెన్స్, మెట్రో, డిఫెన్స్, రోడ్డు మార్గం, రైలు, జలమార్గాల్లో అవయవాలను రవాణా చేసేటప్పుడు కచ్చితంగా పాటించాల్సిన పద్ధతిని నిర్దేశించింది. మానవ అవయవాలను దేశ భూభాగంలో మాత్రమే రవాణా చేయాలని స్పష్టం చేసింది.