Pneumonia Cases | న్యుమోనియా కేసుల వ్యాప్తి : రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు
చైనాలో న్యుమోనియా కేసులు (Pneumonia Cases) విపరీతంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.
న్యూఢిల్లీ : చైనాలో న్యుమోనియా కేసులు (Pneumonia Cases) విపరీతంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఎలాంటి పరిస్ధితి ఎదురైనా అధిగమించేందుకు సన్నద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది. చైనాలో న్యుమోనియా కేసులు ప్రబలుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రుల్లో తగిన ఏర్పాట్లకు సంబంధించి సమీక్షించాలని రాష్ట్రాలను కోరింది. కాగా, గత కొన్ని రోజులుగా చైనాలో న్యుమోనియో తరహా కేసులు విపరీతంగా నమోదవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
చైనాలోని ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయని, రోగ లక్షణాలు న్యుమోనియాను పోలి ఉన్నాయని కధనాలు వచ్చాయి. చైనా ఆసుపత్రుల్లో ఈ తరహా లక్షణాలతో చేరుతున్న వారిలో పిల్లలే అత్యధికంగా ఉన్నారని సమాచారం. మరోవైపు చైనాలో కొత్త రకం వైరస్ వ్యాపించిందనే వార్తలను డ్రాగన్ తోసిపుచ్చింది. ఇవి సీజనల్ శ్వాసకోశ సమస్యేలనని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక చైనాలో న్యుమోనియా తరహా కేసుల తీవ్రతను గమనిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రం అప్రమత్తంగానే ఉందని స్పష్టం చేశారు. చైనాలో న్యుమోనియా కేసుల ఉద్ధృతిని ఐసీఎంఆర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు వివరించారు. ఏదేమైనా భారత్‌కు న్యుమోనియా ముప్పు తక్కువేనని కేంద్రం ప్రకటించడం కొంత ఊరట కలిగిస్తోంది.
Read More :
Fighter Movie | క్రేజీ అప్డేట్.. హృతిక్ రోషన్ ‘ఫైటర్’ టీజర్ రిలీజ్ వచ్చేది అప్పుడే.?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

