Fighter Movie | క్రేజీ అప్డేట్.. హృతిక్ రోషన్ ‘ఫైటర్’ టీజర్ రిలీజ్ వచ్చేది అప్పుడే.?
Fighter Movie | ఈ ఏడాది షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన 'పఠాన్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఇక ఇదే ఊపులో ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'ఫైటర్' (Fighter). హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, ఎన్టీఆర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Fighter Movie | ఈ ఏడాది షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ‘పఠాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఇక ఇదే ఊపులో ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఫైటర్’ (Fighter). హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, ఎన్టీఆర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇండియా ఫస్ట్ ఏరియల్ యాక్షన్ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ మూవీకి సంబంధించి మేకర్స్ తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ 2024 రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉందని తెలుపుతూ.. కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇక ఈ సినిమా సంబంధించి డిసెంబర్ తొలివారంలో టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Born to fly. Sworn to protect. #FIGHTER pic.twitter.com/LQAtZust7N
— Siddharth Anand (@justSidAnand) November 25, 2023
తొలిసారి హృతిక్ రోషన్, దీపికా పదుకొనే క్రేజీ కాంబో సిల్వర్ స్క్రీన్‌పై మెరువనుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఏడాది పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు సిద్దార్థ్ ఆనంద్. అయితే పఠాన్ తర్వాత సిద్దార్థ్ ఆనంద్ మరోసారి దీపికాపదుకొనేను హీరోయిన్గా తీసుకోవడంతో హిట్టు గ్యారంటీ అని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

