తిరువనంతపురం: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక్ కోడ్లను తమ రాష్ట్రం ఎంతమాత్రం అంగీకరించదని, వాటిని తమ వద్ద అమలు చేయబోమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వీ శివన్కుట్టి మాట్లాడుతూ చాలా రాష్ర్టాలు వీటిని అమలు చేయాలని నిర్ణయించాయని, కానీ కేరళ మాత్రం వాటిని అంగీకరించదని తెలిపారు. గత నెల కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖతో జరిగిన సమావేశంలోనే ఈ విషయాన్ని స్పష్టం చేశామన్నారు.