కూలీల ‘ఉపాధి’పై కేంద్రం కక్ష
కూలీల కడుపు నింపే ఉపాధి హామీ పథకంపై కేంద్రం కక్ష సాధింపులకు దిగుతున్నది. కూలి డబ్బులు రాక,
- బీహార్‌కు రూ.1,000 కోట్లు.. తెలంగాణకు 110 కోట్లు బాకీ
- చెల్లించని కేంద్ర ప్రభుత్వం.. దిక్కుతోచని స్థితిలో కూలీలు
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): కూలీల కడుపు నింపే ఉపాధి హామీ పథకంపై కేంద్రం కక్ష సాధింపులకు దిగుతున్నది. కూలి డబ్బులు రాక, తినడానికి తిండి గింజలులేక కూలీలు పెట్టేబేడా సర్దుకొని వలసబాట పడుతున్నారు. ముఖ్యంగా విపక్ష రాష్ర్టాలపై కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నది. బీహార్‌కు మంజూరు చేయాల్సిన రూ.వెయ్యి కోట్లకు పైగా ఉపాధి నిధులను విడుదల చేయకుండా కొన్నేండ్లుగా తాత్సారం చేస్తున్నది.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత ఆగస్టులో బీజేపీతో తెగతెంపులు చేసుకొని, విపక్ష పార్టీ ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే ఉపాధి హామీ నిధుల చెల్లింపులు నిలిచిపోయాయని, కేంద్రం కావాలనే నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నదని ఆరోపణలున్నాయి. నెలల తరబడి బకాయిలు చెల్లించకపోవడం వల్ల కూలీలు వలస బాట పడుతున్నారని సీఎం నితీశ్ కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జీవనోపాధి అవకాశాలు తగినంత లేకపోవడంతో బీహార్‌లో అధిక శాతం గ్రామీణులు ఉపాధి హామీ పనులపైనే ఆధార పడతారని గ్రామీణాభివృధ్ధి మంత్రి శర్వాన్ కుమార్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కంటే ఎక్కువ గ్రామ పంచాయితీల్లో ఈ పథకం అమలు అవుతున్నదని, కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల చాలా పనులు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు నాటికే బీహార్‌లో 15 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయని, మరో పది కోట్ల పనిదినాలకు నిధులు మంజూరు చేయాలని కోరితే 2.5 కోట్ల పనిదినాలకే కేంద్రం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఏడాదిలో ఒక్కో కూలీకి ఉపాధి కల్పించే రోజుల సంఖ్య 100 నుంచి 200కు పెంచాలని నితీశ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణకూ బకాయి
తెలంగాణకు కూడా ఉపాధి హామీ కూలీ పథకం కింద కేంద్రం నిధులు విడుదల చేయటం లేదు. రాష్ర్టానికి బకాయిపడ్డ రూ.110 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇటీవలే కేంద్రానికి లేఖ కూడా రాశారు. రెండు నెలలుగా నిధులు విడుదల కాకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారనని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

