One Nation One ID | దేశంలోని ప్రతి విద్యార్థికి ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు కార్డు.. కసరత్తు చేస్తున్న కేంద్రం
‘ఆధార్' తరహాలో దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ‘వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డు’ తెచ్చే యోచనలో కేంద్ర విద్యా శాఖ ఉన్నది.
- విద్యార్థుల గుర్తింపునకు కేంద్ర ప్రభుత్వం యోచన
- ఆధార్ తరహాలో ‘అపార్’
- అన్ని బడులకూ వర్తింపు
- విద్యార్థి అకడమిక్ చరిత్ర ఇందులో నిక్షిప్తం
- ఐడీకి తల్లిదండ్రుల సమ్మతి తీసుకోవాలని ఆదేశాలు
One Nation One ID | న్యూఢిల్లీ: ‘ఆధార్’ తరహాలో దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ‘వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డు’ తెచ్చే యోచనలో కేంద్ర విద్యా శాఖ ఉన్నది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే ఈ గుర్తింపు నంబర్‌ను ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ(ఏపీఏఏఆర్-అపార్)గా పిలువనున్నారు. అపార్ ఐడీ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అన్ని రాష్ర్టాలు, యూటీలను కేంద్ర విద్యా శాఖ తాజాగా ఆదేశించింది.
ఏమిటీ అపార్ ఐడీ?
అపార్ నంబర్‌ను విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు అపార్ ఐడీ ఇవ్వనున్నారు. దీనిలో విద్యార్థి అకడమిక్ జర్నీ, చరిత్ర(విద్యా ప్రయాణం), విజయాలు నిక్షిప్తం అవుతాయని, అవసరమైన సమయంలో ట్రాక్ చేయొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
క్యూఆర్ కోడ్ మాదిరిగా అపార్
విద్యార్థులకు కొత్త అపార్ గుర్తింపు కార్డుల జారీకి సంబంధించి తల్లిదండ్రులతో మాట్లాడాలని, అందుకు వారి సమ్మతి తీసుకోవాలని కేంద్రం అన్ని పాఠశాలలను కోరింది. అపార్ ఐడీ ప్రాముఖ్యతను వివరించేందుకు అక్టోబర్ 16-18 మధ్య తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని సూచిం చింది. విద్యార్థికి అపార్ ఐడీ జారీకి సమ్మతి తెలిపిన తల్లిదండ్రులు.. ఏ సమయంలోనైనా దాన్ని ఉపసంహరించుకోవచ్చు.
విద్యార్థుల డాటా రహస్యంగా ఉంటుందని, ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే పంచుకోవడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొన్నట్టు తెలిపింది. ‘వన్ నేషన్-వన్ స్టూడెంట్ ఐడీ’ స్కీమ్‌పై ఏఐసీటీఈ చైర్మన్ టీజీ సీతారామన్ మాట్లాడుతూ ఆపార్, నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ దేశంలోని విద్యార్థులకు క్యూఆర్ కోడ్ మాదిరిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థి నేర్చుకొన్న ప్రతి నైపుణ్యం, సాధించిన విజయం అందులో జమ అవుతుందని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

