న్యూఢిల్లీ, నవంబర్ 2: ప్రతిపక్ష ఎంపీల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయంటూ యాపిల్ సంస్థ ప్రమాద హెచ్చరికలు జారీచేయగా, ఈ వ్యవహారంపై కేంద్ర ఐటీ శాఖ విచారణకు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘సెర్ట్-ఇన్’ నుంచి మొబైల్ తయారీ కంపెనీ యాపిల్‌కు నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. గోప్యత, భద్రతపై పదే పదే మాట్లాడే యాపిల్, హ్యాకింగ్‌పై 150కిపైగా దేశాల్లో ఫోన్ వాడుతున్న వారికి ‘అలర్ట్ నోటిఫికేషన్లు’ ఎందుకు జారీ చేసిందని, దీనిపై కంపెనీ స్పష్టత ఇవ్వాలని నోటీసులో ‘సెర్ట్-ఇన్’ పేర్కొన్నది.