న్యూఢిల్లీ : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గురువారం నూతన డిజిటల్ ఇంటర్ఫేస్ ఈసీఐనెట్‌ను ప్రారంభించారు. దీనిని ఓటర్లు, అధికారులు, రాజకీయ పార్టీల కోసం తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇది తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టే సాధనమని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని వాస్తవ అంశాలు దీనిలో ఉంటాయన్నారు. ఈసీ నిర్వహిస్తున్న 40కిపైగా మొబైల్, వెబ్ అప్లికేషన్లను కలిపి ఈసీఐఎన్ఈటీని అభివృద్ధి చేశారు.
బెంగళూరు: మరో రాష్ట్రంలో గవర్నర్ లొల్లి కొనసాగింది. గురువారం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చదవకుండా ఉభయ సభలనుద్దేశించి మూడే మూడు వాక్యాలతో తన ప్రసంగాన్ని ముగించి వాకౌట్ చేశారు. ఆయన చర్యను నిరసించిన అధికార కాంగ్రెస్ సభ్యులు ఆయనను ఘెరావ్ చేయడానికి ప్రయత్నించారు.