పనాజీ: గోవాలో అనుమానాస్పదంగా మరణించిన బీజేపీ నాయకురాలు సొనాలి ఫోగట్ కేసు రోజుకో మలుపుతిరుగుతున్నది. మరణానికి మందు గోవా క్లబ్లో ఒక వ్యక్తి బలవంతంగా ఆమెతో మత్తుమందు కలిపిన మద్యం తాగించినట్లు తెలుస్తున్నది. అనుచరుడు, కేసులో నిందితుడైన సుధీర్ సగ్వాన్, సొనాలి ఫోగట్‌తో బాలవంతంగా బాటిల్‌తో తాగించాడు. అయితే అప్పటికే మత్తులో ఉన్న ఆమె దీనికి నిరాకరించినా అతడు ఆగలేదు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హర్యానాకు చెందిన బీజేపీ నాయకురాలు, మాజీ టిక్‌టాక్ స్టార్, రియాలిటీ షో బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సొనాలి ఫోగట్, గోవాకు వచ్చిన ఒక రోజు తర్వాత ఈ నెల 23న అనుమానాస్పదంగా మరణించింది. ఆమె బస చేసిన హోటల్ నుంచి ఉత్తర గోవాలోని అంజునా ఆసుపత్రికి తరలించారు. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
అయితే కలిసి గోవాకు వెళ్లిన స్వగాన్, సుఖ్విందర్ సింగ్, ఆమెను హత్య చేశారని సొనాలి సోదరుడు ఆరోపించాడు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా శరీరంలో అంతర్గతంగా స్వల్పగాయాలున్నట్లు నిర్థారణ అయ్యింది. దీంతో గోవా పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. సుధీర్ సగ్వాన్, సుఖ్విందర్ సింగ్‌తోపాటు క్లబ్ యజమాని, డ్రగ్స్ డీలర్‌ను అరెస్ట్ చేశారు.
CCTV Shows #SonaliPhogat Forced To Drink At Club Hours Before Death https://t.co/2C73b6wjGw pic.twitter.com/ow6l33JQBo
— NDTV (@ndtv) August 27, 2022