CBI summons | ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు.. 16న విచారణకు రావాలని పిలుపు
CBI summons | ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించనున్నది. అయితే ఒక ముఖ్యమంత్రికి సీబీఐ సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారిగా తెలుస్తున్నది. ఢిల్లీతోపాటు పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల గుర్తించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లను సీబీఐ (CBI summons) జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణకు ఈ నెల 16న సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించనున్నది. అయితే ఒక ముఖ్యమంత్రికి సీబీఐ సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారిగా తెలుస్తున్నది. ఢిల్లీతోపాటు పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల గుర్తించింది. ఈ తరుణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు శుక్రవారం సమన్లు జారీ చేయడం గమనార్హం.
కాగా, ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేయగా ఆయన జైలులో ఉన్నారు. శుక్రవారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీని గురించి ప్రస్తావించారు.‘ దేశ పురోగతిని కోరుకోని అనేక దేశ వ్యతిరేక శక్తులు దేశంలో ఉన్నాయి. వీరంతా మనీష్ సిసోడియాను జైలుకు పంపారు. సిసోడియాను జైలుకు పంపిన వారు దేశానికి శత్రువులు’ అని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆప్ ప్రభుత్వం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని పలుసార్లు ఆయన ఆరోపించారు.
మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బీజేపీ అధికారంలో ఉన్న గోవా పోలీసుల నుంచి కూడా సమన్లు అందాయి. ప్రజా ఆస్తులను పాడు చేశారన్న ఆరోపణకు సంబంధించిన కేసుపై విచారణకు ఈ నెల 27న హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
Also Read:
Power Subsidy | ఢిల్లీలో విద్యుత్ రాయితీ బంద్.. ఎల్జీ-ఆప్ సర్కార్ మధ్య మరో పోరు షురూ
Nitish Kumar | ప్రతిపక్షాల ఐక్యతకు అంతా సిద్ధం.. కొన్ని పార్టీలతో మాట్లాడాల్సి ఉంది: నితీశ్ కుమార్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

