Mahua Moitra | టీఎంసీ నేత మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ సోదాలు
Mahua Moitra | పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకున్నారని (Cash For Query Case) టీఎంసీ నేత, మాజీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) పై వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది.
Mahua Moitra | పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకున్నారని (Cash For Query Case) టీఎంసీ నేత, మాజీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) పై వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే మహువా మొయిత్రా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు (CBI Raids) చేపట్టారు. శనివారం ఉదయం నుంచి పశ్చిమబెంగాల్లోని కోల్‌కతా (Kolkata) నివాసంతో పాటు ఇతర నగరాల్లోని మహువాకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కాగా, యాంటీ కరప్షన్ అంబుడ్స్‌మన్ లోక్‌పాల్ మహువా కేసుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా సోదాలు చేపట్టింది. మరోవైపు ఈ కేసు కారణంగా మహువా లోక్‌సభ సభ్యత్వం రద్దయిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని క్రిష్ణానగర్ స్థానం నుంచి ఆమె మళ్లీ బరిలోకి దిగుతున్నారు.
Also Read..
Anand Mahindra | ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. సర్ఫరాజ్ తండ్రికి థార్ కారు
Kate Middleton | అదృశ్యం వార్తల వేళ.. క్యాన్సర్ బారినపడినట్లు ప్రకటించిన కేట్
Terror Attack | మాస్కోలో ఉగ్రదాడి.. నెలక్రితమే హెచ్చరించామన్న అమెరికా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

