Terror Attack | మాస్కోలో ఉగ్రదాడి.. నెలక్రితమే హెచ్చరించామన్న అమెరికా
Terror Attack | రష్యా రాజధాని మాస్కోలో (Mascow) భారీ ఉగ్రదాడి ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నెల రోజుల క్రితమే రష్యాను హెచ్చరించినట్లు (US Warned Russia ) తెలిపింది.
Terror Attack | రష్యా రాజధాని మాస్కోలో (Mascow) భారీ ఉగ్రదాడి ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. శుక్రవారం రాత్రి (రష్యా కాలమానం ప్రకారం) క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి (Crocus City Hall) ప్రవేశించిన ఐదుగురు దుండగులు (Terror Attack) విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 60 మందికిపైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్ (ISIS) ప్రకటించింది. అయితే ఈ ఉగ్రదాడి ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నెల రోజుల క్రితమే రష్యాను హెచ్చరించినట్లు (US Warned Russia ) తెలిపింది.
మాస్కోలో ఉగ్ర ఘటనపై వైట్‌హౌస్ (White House) జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి అడ్రియెన్నీ వాట్సన్ మాట్లాడుతూ.. మాస్కోలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నెల రోజుల క్రితమే అమెరికా ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు చెప్పారు. కాన్సర్ట్‌లు, ప్రజలు ఎక్కువగా గుడిగూడే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని వాషింగ్టన్ వెంటనే రష్యా అధికారులకు అందించినట్లు తెలిపారు. ఏదైనా నిఘా సమాచారం అందిన వెంటనే అమెరికా ఆయా దేశాలను అలర్ట్ చేస్తుందని ఈ సందర్భంగా వాట్సన్ పేర్కొన్నారు.
రష్యా రాజధాని మాస్కోలో (Mascow) భారీ ఉగ్రదాడి జరిగింది. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి (Crocus City Hall) ప్రవేశించిన ఐదుగురు దుండగులు (Terror Attack) కాల్పులకు తెగబడ్డారు. దీంతో సుమారు 60 మంది మృతిచెందారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ఫిక్నిక్ సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ (FSB) అధికారులు వెల్లడించారు.
Also Read..
Terror Attack | మాస్కోలో ఉగ్రదాడి.. 60 మంది మృతి
PM Modi | అండగా ఉంటాం.. మాస్కో ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ
Kate Middleton | అదృశ్యం వార్తల వేళ.. క్యాన్సర్ బారినపడినట్లు ప్రకటించిన కేట్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

