(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): పర్యావరణ మార్పులు దేశంలోని గ్రామీణ మహిళల ఆదాయం తగ్గుదలకు కారణమవుతున్నాయని యూఎన్ తాజా నివేదిక పేర్కొన్నది. కరువు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు వంటి అంశాలు భారత్లో గ్రామీణ మహిళల ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయని, అయినా జాతీయ వాతావరణ ప్రణాళికలో వాటి ఊసే లేదని యూనైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ పేర్కొన్నది.
2010-19 మధ్య లక్ష గ్రామీణ కుటుంబాల డాటాను విశ్లేషించిన ఎఫ్ఏవో.. పురుషుల కంటే స్త్రీలు నేతృత్వం వహించే గ్రామీణ కుటుంబాలలో పేదరికం చాలా ఉందని, వారు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపింది.