తమిళనాడులో 428 కోట్ల విలువైన నగదు, బంగారం సీజ్

చెన్నై: తమిళనాడులో భారీ స్థాయిలో నగదు, బంగారంతో పాటు ఖరీదైన ఇతర వస్తువులను సీజ్ చేశారు. వాటి మొత్తం విలువ సుమారు 428 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రేపు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రమంతటా ఒకే దశలో పోలింగ్ జరనున్నది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఐటీశాఖ అధికారుల సోదాల్లో సుమారు 428 కోట్లు విలువైన మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో సుమారు 225.5 కోట్ల నగదు ఉన్నది. ఇక బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువుల ఖరీదు సుమారు 176 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన ఐటీ సోదాల్లో ఆ మొత్తం లభ్యం అయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం చెన్నైతో పాటు ఇతర నగరాల్లోనూ ఐటీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఎవరి నుంచి, ఎక్కడ నుంచి, ఎంతెంత స్వాధీనం చేసుకున్నారో ఇంకా అధికారులు స్పష్టంగా వెల్లడించలేదు. కానీ ఇటీవల డీఎంకే నేత ఇండ్లల్లో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. డీఎంకే నేత స్టాలిన్ అల్లుడు శబరీశన్‌తో పాటు వేలూ ఇంట్లో ఐటీ తనిఖీలు జరిగాయి.రాణిపేట్ జిల్లాల్లో సుమారు 92 లక్షలు, థౌజెండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి 1.23 కోట్ల, సేలం నుంచి 1.15 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

