గుండెపోటు మరణాల్లో 2030 నాటికి భారత్ నెంబర్ వన్.. హెచ్చరించిన కార్డియాలజిస్ట్
Cardiac Deaths | భారతదేశం 2030 నాటికి గుండెపోటు మరణాల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సీఎస్ మంజునాథ్ హెచ్చరించారు. ఇదే సమయంలో యువత, మధ్య వయస్కుల్లో గుండె సంబంధిత సమస్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. డాక్టర్ సీఎస్ మంజూనాథ్ జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్. ఆయన ‘హెల్తీ మెడికాన్-2022’ అనే అంశంపై హెచ్ఏఎల్ వైద్యులకు సంబంధించిన జాతీయ సదస్సులో పాల్గొని, ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి, అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించిన ఆయన.. ముప్పును ఎదుర్కొనేందుకు సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శని, ఆదివారాల్లో హెచ్ఏఎల్ వైద్యుల సదస్సు జరగ్గా.. హెచ్ఏఎల్ సీఎండీ ఆర్ మాధవన్ ప్రారంభించారు.
గుండెపోటు ఎప్పుడు వస్తుంది ?
శరీరంలోని సిరల్లో రక్తప్రసరణ సజావుగా సాగకపోయి రక్తం గడ్డకట్టడం మొదలవుతుంది. దీని కారణంగా రక్తం గుండెకు చేరదు. అదే సమయంలో గుండెకు ఆక్సిజన్ అందడం కూడా ఆగిపోతుంది. ఈ పరిస్థితిలో గుండెపోటు వస్తుంది. గుండెపోటు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అయితే, సత్వర చికిత్స ఇస్తే రోగులను రక్షించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
వాయు కాలుష్యం కూడా కారణం..
దేశంలో వాయు కాలుష్యం తీవ్ర సమస్యగానే మరింది. దేశంలోని పలు నగరాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం.. వాయు కాలుష్యానికి గురైన గంటలోనే ఓ వ్యక్తి గుండెపోటుకు గురవుతాడు. రోడ్లపై తిరిగే వాహనాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, నిర్మాణ ప్రాంతాలపై వచ్చే దుమ్ము ధూళితో గాలిలో కాలుష్యం ఏర్పడుతుందని నివేదిక పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

