చెన్నై: ప్రముఖ గుండె శస్త్ర చికిత్స నిపుణుడు కేఎం చెరియన్(80) కన్నుమూశారు. శనివారం బెంగళూరులో ఓ ఫంక్షన్కు హాజరైన ఆయన కుప్పకూలి చనిపోయారు. దేశంలో 50 ఏండ్ల క్రితం గుండెకు తొలి కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ (ధమనుకు సంబంధించిన సర్జరీ) చేసిన వైద్యుడిగా చెరియన్ ఘనత సాధించారు.
చెరియన్ మృతి తీరని విషాదమని భారత గుండె శస్త్ర చికిత్స నిపుణుల మండలి అధ్యక్షుడు రాజేశ్ రాజన్ తెలిపారు. వైద్య రంగంలో భవిష్యత్తు ఆవిష్కరణలపై చెరియన్తో ఇటీవలే చర్చించానని డబ్ల్యూహెచ్వో మాజీ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఆవేదన వ్యక్తం చేశారు.