న్యూఢిల్లీ, మే 18: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించి కీలక విషయం వెలుగు చూసింది. విమానం ప్రమాదానికి గురి కాకుండా పైలట్ సుమిత్ సభర్వాల్..తన చివరి క్షణం వరకు ప్రయత్నించినట్టు..‘డెయిలీ మెయిల్’ వార్తా కథనం పేర్కొన్నది. విమాన ప్రమాదంలో తన కుటుంబంలోని ముగ్గుర్ని కోల్పోయిన రోమిన్ వోహ్రా, దవాఖాన మార్చురీలో తాను చూసిన దృశ్యాలను ‘డెయిలీ మెయిల్’తో వెల్లడించారు. తన బంధువుల అవశేషాలను గుర్తించేందుకు లోపలికి వెళ్లగా, కెప్టెన్ సుమీత్ సభర్వాల్ మృతదేహాన్ని మార్చురీలో విడిగా ఉంచారని, కూర్చున్న భంగిమలోనే అతడు ప్రాణాలు వదిలినట్టు ఉన్నాడని అన్నా డు. విమానాన్ని నియంత్రించే స్టీరింగ్ కాలమ్
(యోక్)ను పైలట్ గట్టిగా పట్టుకునే ఉన్నాడని చెప్పాడు. వోహ్రా చెప్పిన మాటలను ఒక వైద్యుడు కూడా బలపర్చాడని వార్తా కథనం పేర్కొన్నది. నిరుడు లండన్‌కు వెళ్తున్న ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం, టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికులు, సిబ్బందితోపాటు నేలపై ఉన్న 19 మంది సహా మొత్తం 260 మంది మరణించారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.