Cancer | న్యూఢిల్లీ: క్యాన్సర్ మహమ్మారి 50 ఏండ్లలోపు వారిని కూడా కబళిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 1990 తర్వాత క్యాన్సర్ విజృంభిస్తున్నదని, 50 ఏండ్లలోపు వారిలో కొత్త కేసులు 79 శాతం పెరిగాయని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ (స్కాట్లాండ్) పరిశోధకులు వెల్లడించారు. అధ్యయన వివరాల్ని ‘బీఎంజే అంకాలజీ’ జర్నల్ ప్రచురించింది. దీని ప్రకారం, గొంతు, ప్రొస్టేట్ క్యాన్సర్ కేసుల సంఖ్య చాలా వేగంగా పెరిగింది. రొమ్ము, గొంతు, ఊపిరితిత్తులు, పేగు, జీర్ణాశయ క్యాన్సర్లు అత్యధిక మరణాలకు కారణమయ్యాయి. గత 30ఏండ్లుగా ప్రపంచంలో క్యాన్సర్ వ్యాధి విస్తరిస్తున్న తీరును ఈ నివేదిక వివరించింది.