పాట్నా: క్యాన్సర్‌తో (Cancer Patient) పోరాడుతున్న ఒక మహిళ చివరి దశలో ఉన్నది. అయినప్పటికీ స్ట్రెచర్‌పై పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసింది. బీహార్‌లోని దర్భం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చౌగ్మా గ్రామానికి చెందిన సుభద్రా దేవి క్యాన్సర్‌తో పోరాడుతున్నది. జీవితం చివరి దశలో ఉన్న ఆమె గత నాలుగు రోజులుగా ఏమీ తినలేక కేవలం నీటిని మాత్రమే తాగుతున్నది. అయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని భావించింది. దీంతో ఆ మహిళ కుమారుడు విజయ్ కుమార్ మిశ్రా ఆమెను స్ట్రెచర్‌పై పోలింగ్ బూత్‌కు తీసుకువచ్చాడు. క్యూలో ఉన్న ఓటర్లు ఆమెకు దారి ఇచ్చారు. దీంతో స్ట్రెచర్‌పై పోలింగ్ రూమ్‌లోకి వెళ్లిన ఆ మహిళ తన కుమారుడి సహాయంతో ఓటు వేసింది.
కాగా, ఓటు వేసిన తర్వాత ఆ మహిళ కుమారుడు విజయ్ కుమార్ మిశ్రా మీడియాతో మాట్లాడాడు. జీవితంలో చివరి క్షణాల్లో ఉన్న తల్లి ఈ దేశ పౌరురాలిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి ఓటు వేసిందని తెలిపాడు. క్యాన్సర్ బారిన పడటంతో చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గత నాలుగు రోజులుగా కొన్ని నీటి చుక్కలు మాత్రమే తీసుకుంటోందని చెప్పాడు. ఓటు వేస్తావా అని అడినప్పుడు, వేస్తానని తన కోరికను ఆమె వ్యక్తం చేయడంతో స్ట్రెచర్‌పై పోలింగ్ బూత్‌కు తీసుకువచ్చి ఓటు వేయించినట్లు వెల్లడించాడు.