న్యూఢిల్లీ : క్యాన్సర్‌కు మానవ వ్యర్థాలతో ఔషధాన్ని కెనడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిని ‘ఫెకాల్ కాప్సూల్స్’ అని, శాస్త్రీయ భాషలో ఫెకాల్ మైక్రోబయోటా లేదా ఎఫ్‌ఎంటి అని పిలుస్తారు. ఆరోగ్యవంతుడైన మనిషి వ్యర్థాలను ఫ్రీజ్ చేసి, ఎండపెట్టి వాటిని ఎఫ్‌ఎంటి క్యాప్సూల్స్‌గా తయారు చేస్తారు. ఈ గోలీలు పొట్టలోకి చేరి మంచి సూక్ష్మజీవులను పెంపొందిస్తాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో సాధారణంగా వాడే ఔషధాలతో పోలిస్తే ఈ ఎఫ్‌ఎంటి గోలీలు 40-45 శాతం ఎక్కువ ప్రయోజనకరంగా పనిచేస్తాయి. వీటిని సాధారణ క్యాన్సర్ ఔషధాలతో కలిపి తీసుకొంటే 80 శాతం ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. చర్మ క్యాన్సర్ విషయానికి వస్తే ఎఫ్‌ఎంటి పిల్స్‌ను సాధారణ ఔషధాలతో కలిపి తీసుకొంటే 79 శాతం అధిక ప్రయోజనం చేకూరుతుంది.