LGBTQI | న్యూఢిల్లీ, జూలై 28: ఎల్జీబీటీక్యూఐ (స్వలింగ సంపర్కం చేసే స్త్రీ, పురుషులు, బైసెక్సువల్స్, ట్రాన్స్జెండర్లు) వ్యక్తులు రక్తదానం చేయవచ్చా లేదా అనే విషయంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. రక్తదాతల నిబంధనలు-2017ను సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన స్వలింగ సంపర్కుడు షరీఫ్ డి రంగ్నేకర్ వేసిన పిల్‌పై కోర్టు తీర్పు వెలువరించనుంది.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మహిళా సెక్స్ వర్కర్లు, ఎల్జీబీటీక్యూఐ వ్యక్తులు రక్తదానం చేయకూడదు. అయితే ఈ నిబంధనలు వివక్ష పూరితంగా, ఊహాజనితంగా ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. గుడ్డిగా నిషేధం విధించడం సహేతుక కారణం కాదని వాదించారు. ఇది రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, గౌరవంతో జీవించే హక్కును ఉల్లంఘించడమేనన్నారు.