న్యూఢిల్లీ : 2025 సంవత్సరానికి గాను కేంబ్రిడ్జ్ నిఘంటువు ఈ ఏడాది పదంగా ‘పారాసోషియల్’ నిలిచింది. ఈ సంవత్సరం విద్యా బోధనలో పాటు సామాన్యులు కూడా ఈ పదాన్ని తమ సామాజిక మాధ్యమ పోస్టుల్లో ఎక్కువగా వాడారు.
పారాసోషియల్ అనేది ఒక విశేషణం. ఎవరైనా తమకు తెలియని ప్రసిద్ధ వ్యక్తితో లేదా పుస్తకం/సినిమా/టీవీ సిరీస్ లేదా కృత్రిమ మేధలోని ఒక పాత్రకు మధ్య సంబంధం కలిగి ఉండటం అనే అర్థాన్ని ఈ పదం తెలియజేస్తుంది.